టీజర్ టాక్: ఇచ్చట వాహనములు నిలపరాదు.. పార్కింగ్ తెచ్చిన తంటా..

-

అల వైకుంఠపురములో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన సుశాంత్, ఇకపై పూర్తిగా అలాంటి పాత్రలే చేస్తాడని అనుకున్నారు. కానీ ఆ మాటలకి చెక్ పెడుతూ ఇచ్చట వాహనములు నిలపరాదు అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమా టీజర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజైంది. నో పార్కింగ్ అన్న చోట బండి పార్క్ చేస్తే వచ్చిన ఇబ్బందుల గురించి ఈ సినిమా ఉంటుందని క్లియర్ గా అర్థమైంది.

ఐతే టీజర్ లో చూపించిన దాని ప్రకారం అంత పెద్ద ఇబ్బంది ఏంటనేది తెలియకుండా ఉంది. వెన్నెల కిషోర్ కామెడీ నవ్వించనుందని తెలుస్తుంది. నో పార్కింగ్ అన్న చోట పార్క్ చేసి బండిని పాడుచేసుకున్న సుశాంత్, ఆ విషయంలో ఎలా రియాక్ట్ అయ్యాడనేది చూపించబోతున్నారు. ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ దర్శన్ డైరెక్ట్ చేస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, అభినవ్ గొమఠం కూడా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news