ఏపీలో నామినేషన్లకి నేడే చివరి రోజు..

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నేటితో తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ల ప్రక్రియ ముగియనుంది. ఈనెల 29వ తేదీన సర్పంచ్ ల కోసం 1315 మంది నామినేషన్లు వేశారు.  వార్డు సభ్యుల కోసం 2,200 మంది నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ నెల 30వ తేదీన సర్పంచ్ ల కోసం 8773 మంది నామినేషన్లు దాఖలు  చేయగా వార్డు సభ్యుల కోసం 25,519 మంది నామినేషన్లు దాఖలు అయ్యాయి.

మొదటి విడత నామినేషన్లు వేయడానికి ఈరోజు ఆఖరి రోజు కావడంతో నేడు భారీగా నామినేషన్ లు వేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక గుంటూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు గురించి స్పందించారు. దుగ్గిరాలలో ఓటు కోసం నిమ్మగడ్డ రమేష్ దరఖాస్తు చేసుకున్నారని, స్థానికంగా ఉండటం లేదని విఆర్ఓ రిజెక్ట్ చేసారని అన్నారు. ఓటు హక్కు కోసం మళ్ళీ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నారని, ఓటు హక్కు కల్పించడం పై విచారణ అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news