ఎల్ ఐ సీ పబ్లిక్ కి వచ్చేస్తుంది..

-

దేశంలోనే అతిపెద్ద ఇన్యూరెన్స్ కంపెనీ. ఇన్యూరెన్స్ అనగానే ఎల్ ఐ సీనే గుర్తుకు వస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ ఐ సీ లో పెట్టుబడులు పెట్టాలని చాలా మంది చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు పబ్లిక్ ఆఫర్ కి వస్తుందా, ఎప్పుడెప్పుడు ఎల్ ఐ సీ స్టాక్స్ కొనిపెట్టుకుందామా అని చూస్తున్నవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారికోసం శుభవార్త వచ్చేసింది. ఎల్ ఐ సీ పబ్లిక్ ఆఫర్ కి మరికొద్ది రోజుల్లో రానుంది.

భారతదేశానికి ఈ సంవత్సర కాలం బడ్జెట్ ప్రకటిస్తున్న ఈ రోజున ఎల్ ఐ సీ పబ్లిక్ ఆఫర్ విషయం చర్చకి వచ్చింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటల ప్రకారం ఈ ఏడాది ఎల్ ఐ సీ పబ్లిక్ ఆఫర్ కి వస్తుందట. ఐపీఓ కి రావడానికి మరెన్నో రోజులు పట్టదని తొందర్లోనే ఎల్ ఐ సీ, ఐపీఓ విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక జనరల్ ఇన్యూరెన్స్ కంపెనీల్లో తమ పెట్టుబడులని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news