ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల వేడి మామూలుగా లేదు. ఎలా అయినా ఎక్కువగా ఏకగ్రీవాలు చేయాలన్నా సర్కార్ దానిని సాధించలేకపోయింది అనే చెప్పాలి. నిన్నటితో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో దాదాపుగా ఎన్ని ఏకగ్రీవాలు అయ్యాయి అనే విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తంగా చూసుకుంటే కేవలం 9 శాతం లోపు ఏకగ్రీవాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఇక జిల్లాల వారీగా ఎన్ని ఏకగ్రీవమయ్యాయి అనే విషయాన్ని పరిశీలిస్తే.
- చిత్తూరు జిల్లా పంచాయతీలు..454 కాగా ఏకగ్రీవం అయినవి.. 96
- కడప జిల్లా పంచాయతీలు..206 కాగా ఏకగ్రీవం అయినవి.. 46
- అనంతపురం జిల్లా పంచాయతీలు.. 196 కాగా ఏకగ్రీవం అయినవి.. 6
- కర్నూలు జిల్లా పంచాయతీలు..193 కాగా ఏకగ్రీవం అయినవి.. 54
- నెల్లూరు జిల్లా పంచాయతీలు..163 కాగా ఏకగ్రీవం అయినవి.. 14
- ప్రకాశం జిల్లా పంచాయతీలు..229 కాగా ఏకగ్రీవం అయినవి.. 16
- గుంటూరు జిల్లా పంచాయతీలు.. 337 కాగా ఏకగ్రీవం అయినవి.. 67
- కృష్ణా జిల్లా పంచాయతీలు..234 కాగా ఏకగ్రీవం అయినవి.. 20
- పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీలు.. 239 కాగా ఏకగ్రీవం అయినవి.. 40
- తూర్పు గోదావరి జిల్లా పంచాయతీలు.. 366. కాగా ఏకగ్రీవం అయినవి.. 28
- విశాఖ జిల్లా పంచాయతీలు..340 కాగా ఏకగ్రీవం అయినవి.. 32
- శ్రీకాకుళం జిల్లా పంచాయతీలు.. 321కాగా ఏకగ్రీవం అయినవి.. 34