ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఈ-వాచ్ యాప్ అమలుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 9 వరకు అమల్లోకి తీసుకురావొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యాప్‌కు సంబంధించిన భద్రతా ధ్రువపత్రం అందలేదన్న ప్రభుత్వ న్యాయవాది, ధ్రువ పత్రానికి 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకు వెళ్ళారు.
తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేశారు. ఈనెల 3న ఈ-వాచ్ యాప్ ను ఎస్‌ఈసీ అందుబాటులోకి తెచ్చింది. నిజానికి ఈ యాప్ ను వైసీపీ ముందు నుండీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ మేరకు ఫిర్యాదులు చేయడమే కాక కోర్టులో పిటిషన్ లు కూడా దాఖలు చేశారు. చివరికి ఇరు పక్షాల వాదన విన్న ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశం మీద నిమ్మగడ్డ స్పందించాల్సి ఉంది.