స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటీకరణ ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని కేంద్రానికి చెప్పామని ఆయన అన్నారు.. రాజకీయాలకు అతీతంగా ఉద్యమించి స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణను సమర్థిస్తూ ఉన్నామని మా మీద ఆరోపణలు చేస్తున్నారని అది నిజం కాదని అన్నారు.
ఇక పేదలకు ఇచ్చేందుకే విశాఖ భూముల స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ముందుండి పోరాడతాం అని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే దాదాపు అన్ని పార్టీల వారు ఆందోళనలో పాల్గొంటున్నారు. ఒక పక్క టీడీపీ రిలే నిరాహార దీక్షలకు కూడా దిగుతున్నారు. మరో పక్క కేంద్ర పెద్దలతో నిన్ననే పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయి ఈ అంశంలో ప్రతిపాదనలను వెనక్కు తీసుకోవాలని కోరారు. చూడాలి మరి ఏమవుతుందో ?