షర్మిల ఖమ్మం టూర్ వాయిదా.. ఎందుకంటే ?

-

తెలంగాణలోని వైఎస్ అభిమానుల పై ఫోకస్ పెట్టిన షర్మిల టీం వైఎస్ వెంట నడిచిన వారిని సంప్రదించే పనిలో ఉన్న సంగతి తెలిసిందే.  కొత్త పార్టీ నిర్మాణం కార్యాచరణపై ముఖ్య నాయకులతో షర్మిల మొన్న సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో హైదరాబాదులో పార్టీకి కొత్తగా కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అలాగే ఈ నెల 20వ తేదీన ఖమ్మం జిల్లా అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలానే పార్టీలోకి కేవలం కొత్త వారినే తీసుకోవాలని సూచన ప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే గ్రాడ్యుయేట్ MLC ఎలక్షన్ కోడ్ కారణంగా ఫిబ్రవరి 21 న వైయస్ షర్మిల గారితో  జరగాల్సిన ఖమ్మం జిల్లా వైయస్సార్ అభిమానుల ఆత్మీయ సమావేశం వాయిదా వేయడం జరిగిందని ఆమె ముఖ్య అనుచరుడు కొండా రాఘవరెడ్డి ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news