ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ పంచాయతీ ఎన్నికలు చుట్టూ తిరుగుతున్నాయి అనిపిస్తున్నా విశాఖ అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద అన్ని పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. అధికార వైసీపీ నేతలు ఏకంగా పాదయాత్ర చేస్తామని కూడా ప్రకటించారు. ఈ సమయంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ గుమ్మల సృజన అర్ధరాత్రి సమయంలో ఆకస్మికంగా బదిలీ అయ్యారు.
ప్రస్తుతం బదిలీ వ్యవహారం కలకలంగా మారింది. సృజన స్థానంలో జివిఎంసి కమిషనర్ గా నాగలక్ష్మి సెల్వరాజన్ ను కమిషనర్ గా నియమిస్తూ అర్ధరాత్రి సమయంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకే ఆమెను మార్చినట్లుగా ఉత్తర్వులలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే సృజన రెండు రోజులు సెలవులో ఉన్నారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో నెల రోజులు సెలవు కావాలని కూడా సృజన కోరడం ఆమె కోరిన వెంటనే బదిలీ చేయడం వెనక అధికార పార్టీ ఏమైనా నా పెద్ద ఆలోచన చేస్తోందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల వారు.