గ్యాస్ సిలిండర్ ధరలు నుంచి ఊరట కలగడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే పది లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి ఈ ఫెసిలిటీ కల్పించలేదు. ఏది ఏమైనా ఈ ఫిబ్రవరి నెల లో మీరు మీ సబ్సిడీని పొందారో లేదో అనేది ఇలా చెక్ చేసుకోండి. మీరు మీ సబ్సిడీ డబ్బులు ఇలా ఎంతో ఈజీగా కూడా చెక్ చెయ్యొచ్చు.
ముందుగా మీరు ఇండియన్ గ్యాస్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్ళండి. https://bit.ly/3rU6Lol ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.
ఆ తర్వాత ఒక సిలిండర్ ఇమేజ్ వస్తుంది. కనిపించిందా..? దాని మీద క్లిక్ చేసిన తర్వాత కంప్లైంట్ బాక్స్ ఉంటుంది.
దానిలో సబ్సిడీ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది.
అక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసాక ఇప్పుడు సబ్సిడీ రిలేటెడ్ మీద క్లిక్ చెయ్యండి.
మీకు అందులో కొత్త ఆప్షన్స్ సబ్ కేటగిరి లో కనిపిస్తాయి.
ఇక్కడ మీరు సబ్సిడీ నాట్ రిసీవ్డ్ మీతో మీరు క్లిక్ చేయండి.
ఇలా చేశాక మీరు మొబైల్ నెంబర్ టైప్ చేయండి.
ఇప్పుడు మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ గ్యాస్ కనెక్షన్ ఐడి ని కూడా మీరు ఎంటర్ చేయండి.
మీ మొబైల్ నెంబర్ కనుక లింక్ అయ్యి ఉండకపోతే మీకు వివరాలు కనపడవు గమనించండి. ఇప్పుడు మీరు సబ్మిట్ చేయండి. సబ్సిడీ కి సంబంధించిన అన్ని వివరాలు మీకు కనపడతాయి. మీరు ఎంత సబ్సిడీ రిసీవ్ చేసుకున్నారు?, ఎంత పంపించారు? ఇలా అన్ని వివరాలు మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. లేదంటే మీరు కస్టమర్ కేర్ కి కూడా కాల్ చేయొచ్చు. ఇండియన్ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్ 1800-233-3555 . ఈ నెంబర్ కి మీరు డయల్ చేసి మీరు మీ కనెక్షన్ కి సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఇది ఇలా ఉండగా గ్యాస్ ధర ఫిబ్రవరి నెల లో రెండు సార్లు పెంచారు. మొదట 25 రూపాయలు పెంచారు. ఆ తర్వాత 50 రూపాయలు ఫిబ్రవరి 15న పెంచడం జరిగింది.