ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిణామాల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీకి ఎలాంటి అవకాశాలు కూడా దాదాపుగా కనబడటం లేదు అని చెప్పాలి. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు మాత్రం భారతీయ జనతా పార్టీకి అవకాశాలు సృష్టించే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు కూడా అమరావతి ఉద్యమం విషయంలో భారతీయ జనతా పార్టీ వైఖరి ఏంటి అనేది చాలా మందికి స్పష్టంగా తెలియలేదు.
కానీ ఇటీవలి కాలంలో సోము వీర్రాజు అమరావతి ఉద్యమం విషయంలో స్పందిస్తూ అమరావతికి భారతీయ జనతా పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుంది అని చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు సోము వీర్రాజు మరో కీలక అడుగు వేసే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఇప్పటివరకు కూడా బిజెపి జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ కి వచ్చి అమరావతి గురించి మాట్లాడిన పరిస్థితి లేదు.
కానీ ఈ ఉగాది రోజున అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తెలుగు వారందరికీ ఉగాది చాలా పవిత్రమైన రోజు… ఆ రోజున ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వానికి ఆయన ఒక సమాచారాన్ని కూడా పంపించారని తెలుస్తుంది. అమరావతిని ప్రజలు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి భారతీయ జనతాపార్టీ కూడా అమరావతి ఉద్యమం విషయంలో కాస్త స్పీడ్ గా అడుగులు వేస్తే బాగుంటుంది అనే భావనను బీజేపీ పెద్దలకు వివరించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సందర్భంగా ఆయన ఇదే విషయాన్ని స్పష్టంగా బీజేపీ పెద్దల వద్ద ప్రస్తావించారట.