పవన్ కళ్యాణ్ మాటల వల్లే సినిమా తీసాను.. అక్షర డైరెక్టర్..

-

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన నందితా శ్వేత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం అక్షర. ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థలోని లోపాలని ఎత్తి చూపే విధంగా ఈ సినిమా పుట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ గారి ఒకానొక ఉపన్యాసమే కారణం అని డైరెక్టర్ బి చిన్ని తెలిపాడు. బ్రదర్ ఆఫ్ బొమ్మళి, లండన్ బాబులు సినిమాలను డైరెక్ట్ చేసిన బి చిన్నికి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, విద్యావ్యవస్థ గురించి చాలా సార్లు మాట్లాడాడు.

కార్పోరేట్ విద్యా సంస్థలు విద్యని సరిగ్గా నేర్పించట్లేదని, నాలుగ్గోడల మధ్య బంధించి వారిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయని, విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని, పాఠశాల ఆవరణం ప్రశాంతంగా ఉండాలని, ప్రపంచాన్ని చూస్తూ పిల్లలు పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. అప్పుడు అన్న ఆ మాటలని ప్రేరణగా తీసుకుని విద్యావ్యవస్థ మీదే సినిమా తీసాడు చిన్ని. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్వయంగా దర్శకుడే వెల్లడించాడు. ఫిబ్రవరి 26వ తేదీన ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news