మహారాష్ట్రలో నక్సల్స్ డంప్ ధ్వంసం చేశారు పోలీసులు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో నక్సల్స్‌కు సంబంధించిన ఆయుధాల తయారీ యూనిట్‌ను పోలీసులు ధ్వంసం చేశారు. పోలీసులు కూంబింగ్ చేస్తుండగా నక్సల్స్ డంప్ బయటపడిందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఈ కూంబింగ్‌లో మొత్తం 70 మంది పోలీసులు పాల్గొన్నారని, ఈ ఆపరేషన్ 48 గంటల పాటు కొనసాగింది అని అనిల్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు.
అయితే కూంబింగ్‌లో భాగంగా ఓ పోలీసుకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. కానీ నిజానికి ఇలా ఒక ఆయుధాల తయారీ యూనిట్ దొరకడం ఇదే మొదటి సారి అని చెబుతున్నారు. అసలు ఇలా నక్సల్స్ ఆయుధాల తయారీ యూనిట్ ఎలా నెలకొల్పారు అనేది ఆసక్తికరంగా మారింది.