ఆసక్తికరంగా బాబు బెజవాడ పర్యటన

-

ఈరోజు చంద్రబాబు ఎన్నికల ప్రచారం కోసం విజయవాడ వెళ్లనున్నారు. అయితే నిన్నటి పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటన మీద ఆసక్తి నెలకొంది. ఈ రోజు విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ నుంచి ఈ రోడ్ షో ప్రారంభం కానుంది. అక్కడి నుండి విజయవాడలో పలు ప్రాంతాల్లో ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు.

 

నిజానికి కేసినేని నాని నుంచి బాబు పర్యటనలో పాల్గోనము అని బుద్దా వెంకన్న, అలాగే బోండా ఉమా, నాగుల్ మీరాలు ప్రకటించారు. కానీ నిన్న శ్వేత వెళ్లి వారిని కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరడంతో ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగింది. అంతే కాక అచ్చేన్నాయుడు కూడా వారితో మాట్లాడడంతో ఈ వ్యవహరం పక్కన పెట్టి పని చేసేందుకు వారి సిద్ధం అయ్యారు. చంద్రబాబు ఈరోజు వారందరినీ కూర్చోపెట్టి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news