అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించాక దర్శకుడు సందీప్ వంగాతో పని చేయడానికి చాలా మంది ఆసక్తి చూపారు. అందులో మహేష్ బాబు కూడా ఉన్నారు. మహేష్ బాబుతో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్న సందీప్ వంగా, రెండు కథలని వినిపించాడు కూడా. కానీ అవి రెండు మరీ డార్క్ మూడ్ లో సాగే కథలు కావడంతో మహేష్ పక్కన పెట్టాడు. ఆ రెండింట్లో రణ్ బీర్ తో చేస్తున్న ఆనిమల్ కూడా ఉండడం విశేషం. ఐతే వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందని చాలా రోజుల నుండి వినిపిస్తుంది.
తాజాగా సందీప్ వంగా దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఐతే అది సినిమా కాదు. యాడ్ ఫిల్మ్. ప్రఖ్యాత బ్రాండ్ యాడ్ కోసం మహేష్ బాబు, సందీప్ వంగా దర్శకత్వంలో చేయనున్నాడట. ఈ విషయమై ఇతర వివరాలేమీ బయటకి రాలేనప్పటికీ, మరికొద్ది రోజుల్లో బయటకి వెల్లడి చేస్తారట. మరి యాడ్ ఫిల్మ్ తర్వాత ఫీచర్ ఫిల్మ్ కూడా ఉంటుందేమో చూడాలి.