మహర్షి సినిమాకు జాతీయ అవార్డు వస్తుందని మహేష్ ముందే ఊహించాడా?

-

మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కిన మహర్షి చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వచ్చింది. 2019లో రిలీజైన ఈ చిత్రానికి వసూళ్ళు బాగానే వచ్చాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, వీకెండ్ వ్యవసాయం అనే కాన్సెప్ట్ జనాలకి బాగా నచ్చింది. తాజాగా ఈ సినిమాకి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఒకటి, ఉత్తమ కొరియోగ్రఫీకి మరొకటి అవార్డులు వచ్చాయి. దీంతో చిత్రబృందం చాలా సంతోషంగా ఉంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి ఒకానొక వాట్సాప్ ఛాట్ హిస్టరీని ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అందులో ఊపిరి సినిమాకి ఫిలిమ్ ఫేర్ అందుకున్న వంశీకి కంగ్రాట్స్ చెబుతూ, ఈ సారి జాతీయ స్థాయిలో గుర్తింపుకి రెడీగా ఉండాలని చెప్పాడు. దీన్ని బట్టి మహర్షి కథ అప్పటికే మహేష్ బాబుకి చెప్పి ఉంటాడని, అది బాగా నచ్చే ఆ సినిమాకి జాతీయ అవార్డు వస్తుందని మహేష్ ఊహించాడని అర్థం అవుతుంది. మొత్తానికి అప్పుడెప్పుడో మూడు సంవత్సరాల క్రితం మహేష్ అన్న మాటలు నిజం కావడం నిజంగా ఆశ్చర్యమే.

Read more RELATED
Recommended to you

Latest news