హోటల్ లో చెక్ ఇన్ అయినప్పుడు వీటిని ముందు చెక్ చేసుకోండి…!

-

సాధారణంగా మనం ఏదైనా దూర ప్రయాణాలు చేసినప్పుడు హోటల్లో ఉంటాం. అప్పుడు ముందు వీటిని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. భద్రత అన్నిటికంటే ముఖ్యం. వీటిని ముందు మీరు చెక్ చేసుకుంటే ఏ సమస్య ఉండదు. మరి అవి ఏమిటో ఇప్పుడే చూసేయండి..!

 

హిడెన్ కెమెరాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి:

హిడెన్ కెమెరాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. గూగుల్ లో చూస్తే హిడెన్ కెమెరాల గురించి ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. వీటిని చెక్ చేసుకుని అప్పుడు చెక్ ఇన్ అవడం మంచిది.

డోర్ లాక్ చేసుకోండి :

మీరు చెక్-ఇన్ అయిన తర్వాత డోర్ లాక్ చేసుకోండి. అలానే మీరు బయటకు వెళుతున్నప్పుడు కూడా డోర్ ని లాక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ సామాన్లు సేఫ్ గా ఉంటాయి.

ఫ్రంట్ డెస్క్ వాళ్ళని సంప్రదించండి:

మీరు ఫ్రంట్ డిస్క్ వాళ్ళని సంపాదించడం ముఖ్యం. దీని వల్ల ఫోన్ పని చేస్తుందో లేదో తెలుస్తుంది. అప్పుడు మీకు ఏమైనా కావాలంటే సులువుగా కాల్ చేయొచ్చు. ఒకవేళ ఫోన్ పని చెయ్యలేదు అంటే మీరు వెంటనే కంప్లైంట్ చేస్తే వాళ్ళు చెక్ చేస్తారు. లేదు అంటే మీరు ఫుడ్, మంచి నీళ్లు మొదలైన వాటికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

బెడ్ షీట్స్, టవల్స్ వంటివి చెక్ చేసుకోండి:

రూమ్ లో బెడ్ షీట్స్, టవల్స్ ఉంటాయి. అవి లేకపోయినా క్లీన్ చేసే లేకపోయినా మీరు ఒకసారి వాళ్లకు చెప్తే వాళ్ళు మారుస్తారు కాబట్టి. ఒకసారి మీరు వాటిని కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకపోతే వాళ్ళు వెళ్ళిపోయాక మీరు ఇబ్బంది పడాల్సి వస్తోంది.

మీ విలువైన వస్తువులు భద్రంగా ఉంచుకోండి:

మీ పాస్ పోర్ట్, ఆభరణాలు, వాలెట్, డబ్బులు మొదలైన వాటిని భద్రంగా ఉంచుకోండి. ఇది చాల ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news