బిగ్ బ్రేకింగ్ : నీటిలో తేలిన ఎవర్ గివెన్ నౌక !

-

ఈజిప్ట్ యొక్క సూయజ్ కాలువలో చిక్కుకుపోయిన పెద్ద కార్గో షిప్ – ఎవర్ గివెన్ దాదాపు వారం తర్వాత తిరిగి మళ్ళీ నీటి మీద తేలిందని చివరకు ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే జలమార్గం నుంచి అది తప్పుకోనుందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. 400 మీటర్ల పొడవు (1,312 అడుగులు) మరియు 200,000 టన్నుల బరువు, గరిష్టంగా 20,000 కంటైనర్ల సామర్థ్యం కలిగిన ఎవర్ గివెన్ ప్రస్తుతం 18,300 కంటైనర్లను తీసుకువెళుతుంది.

అయితే బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం , “ఓడ మళ్లీ తేలినా సరే ఈ జలమార్గం నుండి ఎంత త్వరగా ట్రాఫిక్‌ క్లియర్ చేస్తారో తెలియదని 450 కి పైగా నౌకల లాగ్‌జామ్‌ను క్లియర్ చేయడానికి ఎంత సమయం పడుతుందో వెంటనే తెలియదని పేర్కొంది.  ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే జలమార్గమైన ఈజిప్టు సూయజ్ కాలువలో ‘ఎవర్ గివెన్’ అనే పెద్ద కంటైనర్ ఇరుక్కు పోయింది.  ఎంపైర్ స్టేట్ భవనం అంత ఎత్తుగా ఉన్న ఈ ఓడ, బలమైన గాలులు, ఇసుక తుఫాను కారణంగా ఇరుక్కుందని  సూయజ్ కెనాల్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. 

Read more RELATED
Recommended to you

Latest news