టీఆర్ఎస్ పార్టీకి చెందిన నోముల నరసింహయ్య మృతితో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. తెలంగాణలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత టీఆర్‌ఎస్ ఎదుర్కోబోతున్న మూడో ఉపఎన్నిక ఇది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్ ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచినా. దుబ్బాక సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
దీంతో ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపన్న ప్రచారానికి బ్రేక్ పడింది. లోకల్, నాన్‌లోకల్, సామాజికవర్గాల ఈక్వేషన్స తో ఇక్కడ అభ్యర్దిని మార్చాలనే ఆలోచనలు కూడా నడిచాయి. అయితే ఇప్పుడు చివిరికి అలాంటి ఆలోచనలు ఏవీ లేవని తెలుస్తోంది. కాసేపట్లో నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. నోముల కుమారుడు నోముల భగత్ ఉప ఎన్నికల అభ్యర్థిగా ఎంపిక అయ్యారని అంటున్నారు. ఈరోజు సీఎం కేసీఆర్ ను కలిసి భగత్ బీఫాం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.