హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు శుభవార్త.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంపు..!

-

ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ తమ కస్టమర్ల శుభవార్తను అందించింది. ఆర్థిక సంవత్సరం ముగిసి.. కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగు వేయడంతో మార్చి 30వ తేదీ నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి రానున్నట్లు తెలిపింది. వివిధ కాలాలకు సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 0.25 శాతం వడ్డీరేటును పెంచింది. స్థిర డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గిస్తున్న తరుణంలో హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు ఊరటను కల్పించింది. హెచ్‌డీఎఫ్‌సీ అధికార వెబ్‌సైట్‌లో లభించిన సమాచారం ప్రకారం.. 33 నెలల మెచ్చూరిటీ కాలంలో రూ.2 కోట్ల వరకు టర్మ్ డిపాజిట్లపై వార్షిక వడ్డీ రేటు 6.20 శాతం ఉండగా.. 66 నెలల కాలానికి సంబంధించిన డిపాజిట్లపై 6.60 శాతం వడ్డీ ఇస్తోంది. అలాగే 99 నెలల టర్మ్ డిపాజిట్లపై 6.65 శాతం వడ్డీరేటును కల్పిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు ప్రస్తుత వడ్డీ రేట్లపై 25 బీపీఎస్ అదనపు వడ్డీ చెల్లిస్తోంది.

డబ్బు
డబ్బు

హెచ్‌డీఎఫ్‌సీ వరుసగా 25 ఏళ్లుగా క్రిసిల్, ఐసీఆర్ఏ రెండింటిలో మంచి రేటింగ్ దక్కించుకుంది. వినియోగదారుల అవసరాలను బట్టి 12-120 నెలల వరకు వివిధ టర్మ్ ఆప్షన్లను అందుబాటులో ఉంచింది. నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక వంటి వివిధ చెల్లింపు ఎంపికలు కూడా ఉన్నాయి. రుణ పరికరాలపై పెట్టుపడి పెట్టేటప్పుడు పెట్టుబడిదారుడు మొదట భద్రతను చూసుకోవాలి. ఆ తర్వాత ద్రవ్యతను చూసుకోవాలి. ఈ సమయంలో ఎఫ్‌డీలను బ్యాంకు ఎఫ్‌డీలతో పోల్చకూడదని వినియోగదారులు గుర్తించుకోవాలి.

కస్టమర్లు స్థిర డిపాజిట్లు చేసిన తర్వాత మధ్యలోనే అకౌంట్ క్లోజ్ చేసినట్లయితే టాప్ రేటెడ్ ఎఫ్‌డీలు ఎక్కువ ద్రవ్యతను కల్పించవు. కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా డీఐసీజీసీ ఇన్సూరెన్స్ పరిధిలోకి రావని, బ్యాంక్ ఎఫ్‌డీలు రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని అందిస్తాయని కస్టమర్లు తెలుసుకోవాలి. హెచ్‌డీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మినహా కొన్ని అధిక రేటింగ్ కలిగిన కార్పొరేట్ ఎఫ్‌డీలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి బ్యాంకు ఎఫ్‌డీలు, చిన్న పొదుపు పథకాల కంటే ఎక్కువ రాబడిని అందిస్తున్నాయి. ఈ మేరకు చిన్న పొదుపు పథకంపై వడ్డీ రేట్లను తగ్గించే నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. వాస్తవానికి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినా.. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం వరకు అదే వడ్డీరేటు కొనసాగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news