కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ కి సంబంధించిన రిటైల్ చైన్ బిగ్ బజార్ గురువారం నుంచి ఇన్స్టంట్ హోమ్ డెలివరీ సేవలు ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆన్లైన్లో అందుకున్న ఆర్డర్‌ను రెండు గంటల్లో కంపెనీ వస్తువులను డెలివరీ చేయనుంది. సంస్థ చెబుతున్న దాని ప్రకారం, మీరు బిగ్ బజార్ యొక్క మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ ఆర్డర్ ఇస్తే, సమీప స్టోర్ నుండి రెండు గంటల్లో సరుకులు పంపిణీ చేయబడతాయి.
ఈ సేవ ద్వారా, మీరు ఈ బిగ్ బజార్ నుండి బట్టలు, ఆహార వస్తువులు, ఎఫ్ఎంసిజి ఉత్పత్తులు మరియు గృహానికి చెందిన వస్తువులను ఆర్డర్ చేయవచ్చు. ఫ్యూచర్ గ్రూప్ ప్రెసిడెంట్ (ఫుడ్ అండ్ ఎఫ్ఎంసిజి) కమల్‌దీప్ సింగ్ మాట్లాడుతూ ఢిల్లీ – ఎన్‌సిఆర్, ముంబై, బెంగళూరులలో రెండు గంటల్లో కంపెనీ డెలివరీ ప్రారంభించిందని రాబోయే కాలంలో ఈ సేవను ఇతర నగరాలకు విస్తరించాలని కంపెనీ యోచిస్తోందని పేర్కొన్నారు. రాబోయే రెండు, మూడు నెలలకు ప్రతిరోజూ లక్ష ఆర్డర్లు అందజేయాలని మేము భావిస్తున్నామని సింగ్ అన్నారు. రెండవ దశలో, బిగ్ బజార్ రాబోయే 45 రోజుల్లో 21 నగరాలకు రెండు గంటల డెలివరీ సేవను విస్తరించనుంది. రాబోయే ఐదు-ఆరు నెలల్లో ప్రతి బిగ్ బజార్ రీటైల్ స్టోర్ నుండి ఈ డెలివరీ సేవ అందించబడుతుంది.