శక్తిని పెంచే ఐదు రకాల టిఫిన్స్.. రోజంతా ఎనర్జిటిక్..!

-

ఉదయాన్నే హెవీ ఫుడ్ తీసుకోవడం కన్నా.. బ్రేక్ ఫాస్ట్ చేయడం చాలా మంచింది. దీని వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండటంతోపాటు శరీరానికి శక్తి చేకూరుతుంది. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఉదయం పూట కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి.. శరీరానికి శక్తిని పెంచే అల్పాహారాన్ని తీసుకోవాలి. రోజంతా హుషారుగా ఉండేందుకు పోషకాలు కలిగిన బ్రేక్ ఫాస్ట్‌ను తినాలి. అయితే ఈ రోజు మీకు 5 రకాల టిఫిన్స్ గురించి తెలుసుకుందాం. వీటిని రోజు అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. రోజంతా యాక్టివ్‌గా పని చేస్తారు.

Rava_Upma
Rava_Upma

రవ్వ ఉప్మా..
రవ్వ ఉప్మా దక్షిణ భారత వంటకం. దీనిని పచ్చి మిరపకాయలు, కరివేపాకు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం, అవాలు, జీలకర్ర, శనగ పప్పు, నెయ్యి, రుచికి సరపడా ఉప్పు వేసుకుని తయారు చేసుకోవచ్చు. తేలికపాటి రుచికరమైన వంటకాల్లో రవ్వ ఉప్మా చాలా మంచిది. ఇది శరీరానికి ఆరోగ్యాని ఉంచడంతోపాటు శక్తిని పెంచుతుంది.

సాగో పోలెంటా..
సాగో పోలెంటా బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని వేరుశెనగలు, బంగాళాదుంపలు, సాగోతో కలిపి తయారు చేస్తారు. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది చాలా తేలికైన ఆహారం కావడం వల్ల తొందరగా జీర్ణమై శరీరానికి శక్తిని ఇస్తుంది. సాగో పోలెంటాను తిన్న తర్వాత ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తుంది.

ఊతప్ప..
ఊతప్ప దక్షిణ భారతదేశంలోనే ఫేమస్ వంటకం. ఈ వంటకాన్ని ఉరద్ పప్పు, బియ్యం పొట్టుతో తయారు చేస్తారు. ఊతప్ప కొంచెం మందంగా ఉంటుంది. అయితే ఇందులో ఉల్లిపాయలు, కరివేపాకు, కూరగాయలు వేసుకుని తినొచ్చు. దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

పొహా..
పొహా మహారాష్ట్ర ఫేమస్ వంటకం. పోహాను వేరుశెనగతో కలిపి, కొంచెం నూనె వేసుకుని తయారు చేసుకోవాలి. లేదా ఇందులో ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పచ్చి బఠానీలను కూడా వేసుకుని అల్పాహారంగా తీసుకోవచ్చు.

ధోక్లా..
ధోక్లా గుజరాతీలకు అత్యంత ఇష్టమైన టిఫిన్. దీనిని వోట్స్, మొక్కజొన్నతో యారు చేస్తారు. శరీరం అలసటగా అనిపించినప్పుడు తప్పనిసరిగా ధోక్లా తీసుకోవాలి. దీంతో శరీరానికి తొందరగా శక్తి చేకూరుతుంది. ఇది శరీరంలో తేలికగా జీర్ణం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news