పాకిస్తాన్ మీద భారత్‌ మరో సర్జికల్ స్ట్రైక్ ?

-

“పాకిస్తాన్ భారత్‌పై ఏదైనా కుట్ర లేదా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో, భారత్ మరోసారి సైనిక చర్య తీసుకోవచ్చు.” అని అమెరికా నిఘా సంస్థ నివేదికలో పేర్కొంది. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ పాకిస్థాన్‌పై సైనిక చర్యలు తీసుకోకుండా వెనక్కి తగ్గదని ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఈ రెండు దేశాల మధ్య విభేదాలు యావత్‌ ప్రపంచానికి ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది.

భారత మాజీ ప్రధానుల పరిస్థితిలా ఇప్పుడు ఉండదని ప్రస్తుత కాలంలో , ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో, పాకిస్తాన్ రెచ్చగొడితే భారతదేశం సైనిక ప్రతిస్పందన ఇచ్చే అవకాశం ఉందని యుఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక పేర్కొంది. అమెరికా నిఘా సంస్థ ఆఫీస్‌ ఆఫ్‌ ది డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌(ఓడీఎన్‌ఐ).. ప్రపంచ దేశాల ముప్పు అంచనా వార్షిక నివేదికను తాజాగా యూఎస్‌ కాంగ్రెస్‌కు సమర్పించింది. ఇందులో భారత్‌-పాక్‌, భారత్‌-చైనా ఉద్రిక్తతలను ప్రత్యేకంగా ప్రస్తావించింది.  

Read more RELATED
Recommended to you

Latest news