నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు…

-

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగరంలో  ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి మినహా అన్ని ఫ్లైఓవర్స్ పై సోమవారం రాత్రి రాకపోకలను నిషేధించనున్నామని అదనపు సీపీ(ట్రాఫిక్‌) అనిల్‌ కుమార్‌ ప్రకటన విడుదల చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు సోమవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి రెండుగంటల వరకూ అమల్లో ఉంటాయని  వివరించారు. ఇందులో భాగంగా ….

సికింద్రాబాద్‌ నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు సెయిలింగ్‌ క్లబ్‌, కవాడిగూడ క్రాస్‌రోడ్స్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, కట్టమైసమ్మ దేవాలయం మీదుగా అనుమతిస్తారు.

ఖైరతాబాద్‌ కూడలి నుంచి నెక్లెస్‌రోడ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే వాహన చోదకులు ఖైరతాబాద్‌ కూడలి నుంచి రాజ్‌భవన్‌ మీదుగా వారి గమ్యస్థానాలను చేరుకోవాలి.

బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వచ్చే వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు తెలుగుతల్లి సర్కిల్ దగ్గర మళ్లిస్తారు. ఆ వాహనాలు ఇక్బాల్‌ మినార్‌, లక్డీకాపూల్‌, ఆయోధ్య మీదుగా వెళ్లాలి.

లిబర్టీ కూడలి నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనచోదకులు జీహెచ్‌ఎంసీ ఆఫీస్, బీఆర్‌కే భవన్‌, ఇక్బాల్‌ మినార్‌ మీదుగా చేరుకోవాలి.

ఖైరతాబాద్‌ మార్కెట్‌ నుంచి నెక్లెస్‌రోటరీ వైపు వచ్చే వాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు అక్కడి నుంచే మళ్లిస్తారు. ఆ వాహనాలు సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ లేన్‌, లక్డీకాపూల్‌ మీదుగా వెళ్లాలి.

మింట్‌ కాంపౌండ్‌ నుంచి సచివాలయం మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే రహదారిపై వాహనాల రాకపోకలను నిషేధించారు.

నల్లగుట్ట రైల్వే వంతెన నుంచి సంజీవయ్య పార్కు వైపు వచ్చే వాహనాలు కర్బలామైదాన్‌ లేదా మినిస్టర్‌ రోడ్‌ మీదుగా వెళ్లాలి.

మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిని అదుపుచేసేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news