వ్యాక్సిన్ వేశాక ఎంత మందికి కరోనా సోకిందంటే ?

-

కోవిడ్‌ టీకా తీసుకున్న తరువాత  కొందరు చనిపోతున్న విషాదకర వార్తలతో అనేక భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు చాలా మంది వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ సంచలన డేటా విడుదల చేసింది.

కోవాక్సిన్ రెండు మోతాదులు తీసుకున్న వారిలో దాదాపు 0.04 శాతం మంది మాత్రమే కోవిడ్ -19 కు పాజిటివ్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. అలాగే కోవిషీల్డ్ యొక్క రెండు మోతాదులు తీసుకున్న తర్వాత 0.03 శాతం మందికి పాజిటివ్ అని తేలింది. సంక్రమణ పురోగతిపై ఈ డేటాను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) విడుదల చేసింది. అంటే కరోనా వ్యాక్సిన్ వేసిన తరువాత ప్రజలు వ్యాధి బారిన పడుతున్నప్పటికీ  వ్యాధి తీవ్రంకాకుండా నిరోధిస్తుందని ఐసీంఆర్‌ డేటా తేల్చంది. 

Read more RELATED
Recommended to you

Latest news