తిరుపతి ఉప ఎన్నికల్లో దాదాపుగా అధికార వైసీపీ విజయం సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్ల ప్రకారం చూస్తే వైసీపీకి లక్షా 70 వేలకు పైగా రాగా టీడీపీకి 95 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. బిజెపి 16 వేలకు మాత్రమే పరిమితం అయింది. ఇక టీడీపీ అభ్యర్ధి పనాబాక లక్ష్మి కీలక వ్యాఖ్యలు చేసారు. మొదటి రౌండ్ ఫలితాల తర్వాత కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన్నట్టు వచ్చిన వార్తలను పనబాక లక్ష్మీ ఖండించారు.
ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగుంటే దాని ఫలితాలు వేరేగా ఉండేవి అని ఆమె అన్నారు. ఫలితం తెలిసి కూడా తమాషా చూద్దామని కూర్చుని వున్నా అని ఆమె చెప్పుకొచ్చారు. జరగాల్సినవన్ని ముందే జరిగిన తర్వాత ఇప్పుడు జరిగేదేముంది అని అంటూ ఆమె ప్రశ్నించారు.