ఇలా చేస్తే మహిళలు మరెంత ఆరోగ్యంగా ఉండచ్చు…!

-

మహిళలకు చాలా రకాల పనులు ఉంటాయి. వీటి కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేకపోతారు. ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఆహారం తీసుకుంటే మంచిది. అయితే ఈ రోజు మహిళల ఆరోగ్యం కోసం మేము కొన్ని విషయాలు చెప్తున్నాము. మరి వాటి కోసం చూద్దాం..

 

50 ఏళ్ళ కంటే ఎక్కువ వయసులో ఉన్న మహిళలు ఈ విధంగా అనుసరించండి:

50 ఏళ్లు కంటే ఎక్కువ ఉన్న మహిళలు సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. కారం, మసాలా ఎక్కువున్న ఆహారం, వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. స్వచ్ఛమైన నెయ్యి కూడా ఉపయోగించవద్దు. అధికంగా మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ మరియు క్యాల్షియం ఉండే ఆహారం తీసుకోవాలి.

40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వాళ్ళు ఇలా చేయండి:

విటమిన్ డి, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పండ్లు, కాయగూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పంచదారని మరియు రిఫైన్డ్ చేసిన పిండిని తగ్గించాలి.

30 నుండి 40 ఏళ్ల మధ్య వాళ్ళు ఇలా చేయాలి:

చియా సీడ్స్, పల్సెస్, పన్నీరు, గుడ్లు, చికెన్ మరియు చేప వంటివి తీసుకోవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోండి. పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. విటమిన్ b9 b12 విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

30 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవాళ్లు ఇలా చేయాలి:

ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా పీరియడ్స్ కి ముందు ఎక్కువగా ఐరన్ వుండే వాటిని తీసుకోవాలి. ఈ సమయం లో చాలా మంది మహిళలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తారు కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే మూడు నెలలకు ముందు నుండి ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

అదే విధంగా ప్రోటీన్, విటమిన్స్, కాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేటట్లు తీసుకోవాలి. డాక్టర్ని కన్సల్ట్ చేసి డైట్ చార్ట్ ని ప్రిపేర్ చేసి ఈ విధంగా మీరు సరైన పోషకాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news