వేసవి వేడిని చల్లార్చే సలాడ్.. 5నిమిషాల్లో తయారు చేసుకోండిలా..

-

వేసవిలో ప్రధానంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యల్లో జీర్ణశక్తి తగ్గిపోవడం ఒకటి. వేసవిలో జీర్ణక్రియ మీద చాలా ప్రభావం ఉంటుంది. అందుకే మీ ఆహారంలో నీళ్ళు అధికంగా ఉండే వాటిని భాగం చేసుకోవడం ఉత్తమం. రంగు రంగుల కూరగాయలు, పండ్లని భాగం చేసుకోండి. పండ్ల గురించి తీసుకుంటే ముఖ్యంగా మస్క్ మిలన్ చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది. వేసవిలో విరివిగా దొరికే ఈ పండులో ఎన్నో పోషకాలున్నాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

బీటా కెరాటిన్, నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమై రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే వేసవిలో పండ్లు తినాలనుకున్నవారు ఖచ్చితంగా వారి పండ్ల బుట్టలో మస్క్ మిలన్ ని చేర్చండి.

మస్క్ మిలన్ డైరెక్టుగా లేదా జ్యూస్ లాగా చేసుకుని తినవచ్చు. ఇంకా కావాలంటే సలాడ్ తయారు చేసుకుని ఆరగించవచ్చు. మీకేలాగో తెలియలేదంటే ఇక్కడ చూడండి.

ముందుగా ఉల్లిపాయలని కత్తిరించి ఒక పాత్రలోకి తీసుకోండి.

అందులో కొంచెం నిమ్మరసం కలుపుకోండి.

ఇప్పుడు కొంచెం తేనె కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయండి.

మస్క్ మిలన్ ముక్కలని ఆ పాత్రలో వేయండి.

కొన్ని కత్తిరించిన పుదీనా రెబ్బలు, పచ్చిమిర్చి, రెడ్ క్యాప్సికమ్ కలపండి.

కారం, నల్లమిరియాల పొడి, ఉప్పు కలపండి. ఐతే తినాలనుకున్నప్పుడు మాత్రమే ఉప్పు కలపండి. ఉప్పు కలిపి ఎక్కువ సేపు ఉంచితే మస్క్ మిలన్ లోని నీటిశాతం తగ్గిపోతుంది.
ఈ సలాడ్ ని ఆస్వాదించాలంటే సలాడ్ ప్రిపేర్ చేయక ముందు మస్క్ మిలన్ ని రిఫ్రిజిరేటర్లో ఉంచంండి.

Read more RELATED
Recommended to you

Latest news