తౌక్టే ముగిసిందనుకునే లోపే మరో “యష్” రూపంలో మరో తుఫాను.. హెచ్చరిస్తున్న ఐఎమ్ డీ

-

గత కొన్ని రోజులుగా తౌక్టే తుఫాను గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా చెలరేగిన తుఫాను తీవ్ర నష్టాన్ని కలగజేసింది. 2021లో వచ్చిన మొదటి తుఫానుగా గుర్తింపు తెచ్చుకున్న తౌక్టే, నానా భీభత్సం సృష్టించింది. అటు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ తుఫాను కారణంగా వస్తున్న నష్టాలు తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్నాయి. తుఫాను కారణంగా కరెంటు స్తంభాలు పడిపోవడంతో కొన్ని చోట్ల చాలా గంటల వరకు కరెంటు లేకపోవడం ఇబ్బందిగా మారింది.

అనవసర వర్షాలు పంటలను నాశనం చేస్తాయి. దిగుబడిని పూర్తిగా తగ్గించేసాయి. తుఫాను భీభత్సం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు బాగా నష్టపోయాయి. ప్రస్తుతం ఈ తుఫాను మెల్లగా సన్నగిల్లుతుందని వినిపిస్తుంది. ఇలా ఉండగానే మరో తుఫాను గురించి ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్ మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్ మెటీరియాలాజికల్ డిపార్ట్ మెంట్ వారు మాట్లాడుతూ యష్ పేరుతో మరో తుఫాను రానుందని మే 23-24మధ్యలో అది భూమిపై చెలరేగే అవకాశం ఉందని అంటున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం కారణంగా యష్ తుఫాను వస్తుందని వినికిడి. ఒమన్ దేశానికి చెందిన యస్ పేరుని ఈ తుఫానుకి పెట్టారు. ఐఎమ్డీ తుఫాను ఇన్ ఛార్జ్ గా సునితా గారు చెప్పిన దాని ప్రకారం వచ్చే వారంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా తుఫాను వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐతే దీని ప్రభావం ఎక్కడెక్కడి వరకు ఉంటుందనేది ఇంకా అంచనా వేయలేకపోతున్నారు. ఈ విషయం పట్ల తీరప్రాంతాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news