అల‌ర్ట్‌.. బ్లాక్ ఫంగ‌స్‌ను అంటు వ్యాధిగా ప్ర‌క‌టించిన రాజ‌స్థాన్‌..

-

దేశంలో కరోనా కేసులు చాలా వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయితే ఇప్పుడు బ్లాక్ ఫంగ‌స్ చాలా మందికి వ‌స్తోంది. దీన్నే మ్యుకారామికోసిస్‌గా పిలుస్తున్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ క్ర‌మంలోనే రాజ‌స్థాన్‌లోనూ బ్లాక్ ఫంగ‌స్ కేసులు ఎక్కువవుతున్నాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం బ్లాక్‌ ఫంగస్‌ను అంటువ్యాధిగా ప్రకటించింది. హర్యానా ప్రభుత్వం బ్లాక్ ఫంగస్‌ను ఒక రోజు ముందే అంటువ్యాధిగా ప్రకటించ‌గా ఇప్పుడు ఆ జాబితాలో రాజ‌స్థాన్ వ‌చ్చి చేరింది. హర్యానా ప్రభుత్వం బ్లాక్ ఫంగ‌స్ నేప‌థ్యంలో ప‌లు అవసరమైన సూచనలు జారీ చేసింది. వాటిని పాటించకపోతే క‌ఠిన‌ చర్యలు తీసుకుంటారు.

rajasthan announced black fungus as epidemic

కాగా బ్లాక్ ఫంగ‌స్ అంశంపై రాజస్థాన్ వైద్య, ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ రాష్ట్ర ప్రధాన ప్రభుత్వ కార్యదర్శి అఖిల్ అరోరా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం కరోనా వైరస్ సంక్రమణ ప్రభావం వల్ల బ్లాక్ ఫంగస్ రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. కరోనా వైరస్ సంక్రమణ దుష్ప్రభావంగా బ్లాక్ ఫంగస్ ఉద్భవించింది. ఈ క్ర‌మంలోనే కోవిడ్ నుంచి కోలుకున్న చాలా మందికి ఈ వ్యాధి వ‌స్తోంది.

కాగా రాజస్థాన్ ఎపిడెమిక్ యాక్ట్ 2020 లోని సెక్షన్ 3, 4 ల కింద బ్లాక్ ఫంగస్ ను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అంటు వ్యాధిగ ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ పెరుగుతున్న బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం బ్లాక్ ఫంగ‌స్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న‌ను క‌లిగిస్తోంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం కరోనా వైరస్ నుండి కోలుకున్న‌ డయాబెటిక్ రోగులలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వ్యాధితో బాధితుల‌ కళ్ళు, దవడల‌ను తొలగిస్తున్నారు. రాజస్థాన్‌లో సుమారుగా 100 మంది రోగులు బ్లాక్‌ ఫంగస్‌తో బాధపడుతున్నారు. వారి చికిత్స కోసం జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. అక్క‌డ‌ ప్రోటోకాల్ ప్రకారం చికిత్సను అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news