గత కొన్ని రోజులుగా పోలీసులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా గుంటూరు ఎస్పీ టార్గెట్ గా ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసారు. అమ్మిరెడ్డి గారూ…ప్రజల సొమ్ము జీతంగా తీసుకుని తాడేపల్లి కొంపకి చాకిరీ చేయడానికి సిగ్గులేదా? అని ఆయన ప్రశ్నించారు. సోషల్మీడియాలో వీడియో పెట్టినవాళ్లని అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసినట్టు ఏంటా ఓవరాక్షన్? అని ప్రశ్నించారు.
ఇవే వీడియోలు టిడిపిపై పెట్టిన వారిపై మేము పెట్టిన కేసులు ఇప్పటి వరకూ ఎన్నింట్లో అరెస్ట్లు చేశారు అని నిలదీశారు. మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు పెట్టడానికి వచ్చినవారిపైనే రివర్స్ కేసు బనాయించారు అన్నారు. జగన్రెడ్డి దగ్గర పనిచేయాలని అంత ఉత్సాహం, కులపిచ్చి ఉంటే.. పవిత్రమైన ఆ ఖాకీ డ్రెస్ తీసేసి, బులుగు కండువా కప్పుకొండి అని సూచించారు.