లాక్ డౌన్ లో బయటకు వస్తే క్షమించొద్దు అంటున్న తెలంగాణ డీజీపీ

-

తెలంగాణాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో పోలీసులు లాక్ డౌన్ ని చాలా సీరియస్ గా అమలు చేస్తున్నారు. అయినా సరే లాక్ డౌన్ విషయంలో ప్రజలు మాత్రం సరిగా ఉండటం లేదు. ఈ నేపధ్యంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. రోడ్లు పైకి విచ్చల విడిగా వచ్చిన వందలాది వాహనాల విషయంలో కఠినం గా ఉండాలని చెప్పారు.

lockdown

బేగం పేట్ వద్ద రెండు కిలో మీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ లో రెండు అంబులెన్స్ వాహనాలు చిక్కుకున్నాయి. వాహనాలు ను ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీసులు సీజ్ చేస్తున్నారు. రిలాక్సేషన్ తరువాత కూడా అనుమతి లేకుండా రోడ్లు పైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news