భారత్ లో మోగుతూనే ఉన్న మరణ మృదంగం

-

గత 24 గంటల్లో భారత్ లో 4,209 కోవిడ్ -19 మరణాలు నమోదు అయ్యాయి అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2,59,551 కొత్త కేసులు కూడా మన దేశంలో నమోదు అయ్యాయి. ఇక నిన్న క్రియాశీల కేసులకు కొత్త కేసులకు మధ్య వ్యత్యాసం 1 లక్ష పెరిగింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 30,27,925 గా ఉన్నాయి. రికవరీ రేటు క్రమంగా పెరుగుతూ వస్తుంది.

ఎక్కువ కేసులు నమోదు అయిన రాష్ట్రాలు మొదటి 5 రాష్ట్రాలు చూస్తే… 35,579 కేసులతో తమిళనాడు, 30,491 కేసులతో కేరళ, 29,911 కేసులతో మహారాష్ట్ర, 28,869 కేసులతో కర్ణాటక, 22,610 కేసులతో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. మహారాష్ట్రలో 984 మంది ఒకే రోజు మరణించారు. మరణాలు భారీగా నమోదు అవుతుండటం ఇప్పుడు కంగారు పెట్టే అంశం.

Read more RELATED
Recommended to you

Latest news