గ్యాస్ సిలిండర్ వినియోగదారులకి గుడ్ న్యూస్.. సరికొత్త సర్వీసులు షురూ..!

-

గ్యాస్ సిలెండర్ ని మీరు ఉపయోగిస్తున్నారా…? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. తాజాగా ఇండియన్ ఆయిల్ నాలుగు కొత్త సేవలను తీసుకు రావడం జరిగింది. వీటి వలన గ్యాస్ సిలెండర్ వినియోగదారులకి పలు బెనిఫిట్స్ కలుగుతాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

ఇండియన్ ఆయిల్ నాలుగు కొత్త సేవలను తీసుకు రావడం జరిగింది. దీంతో ఇండేన్ గ్యాస్ కస్టమర్లకు బెనిఫిట్ కలుగనుంది. ఇక ఆ సర్వీసుల గురించి చూస్తే.. ఇండేన్ ఎక్స్‌ట్రా తేజ్, చోటా 5 కేజీ ఎల్‌పీజీ సిలిండర్.

మిస్డ్ కాల్ ఎల్‌పీజీ రీఫిల్ బుకింగ్ ఫెసిలిటీ, కాంబో సిలిండర్ (14.2 కేజీ అండ్ 5 కేజీ) ఆక్టేన్ ఎక్స్‌పీ 100, ఎక్స్‌పీ 95 ప్రీమియం పెట్రోల్ వంటి సేవలని తీసుకు వచ్చింది. అదే విధంగా ఇండేన్ గ్యాస్ కస్టమర్లు సిలెండర్ ని బుక్ చెయ్యాలంటే 8454955555 నెంబర్‌ డయల్ చేసి మిస్డ్ కాల్ ఇస్తే చాలు.

కాంబో సిలిండర్ కింద 14.2 కేజీల సిలిండర్‌తోపాటు 5 కేజీల సిలిండర్ కూడా పొందొచ్చు. అదే విధంగా ఇండేన్ ఎక్స్‌ట్రా తేజ్ సిలిండర్ వాడటం వల్ల 5 శాతం వరకు గ్యాస్ ఆదా చేసుకోవచ్చు. ఇలా ఈ కొత్త సేవలని కస్టమర్స్ పొందొచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news