ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ సుధాకర్ మృతి కాస్త సంచలనం అయింది. ఈ మరణం వెనుక ఎవరు ఏంటీ అనేది పక్కన పెడితే డాక్టర్ సుధాకర్ తల్లి లక్ష్మీబాయి కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ మంచివాడే కావచ్చు.. నా కుమారుడు ఈ స్థితికి రావడానికి, నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కారణం అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన ఒక కబ్జా కోరు అని ఆరోపించారు.
నా కుమారుడు మృతికి, కారణమైన వాళ్లకి శిక్ష పడేవరకు విడిచి పెట్టను అని ఆమె హెచ్చరించారు. అంతవరకు నా ప్రాణం ఇలాగే ఉంటుంది అని ఆమె అన్నారు. ఇంత దూరం నుండి లోకేష్ వచ్చారు అని నా కుమారుడు ఇబ్బంది పడినప్పుడు ప్రభుత్వం నుండి ఎందుకు ఎవరు రాలేదు అని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.