పసిడి ప్రియులకి రిలీఫ్. బంగారం ధరలు స్థిరంగానే వున్నాయి. వీటిలో ఎటువంటి మార్పు లేదు. అయితే నాలుగు రోజుల నుండి కూడా బంగారం ధరలు అలానే వున్నాయి. ఇలా స్థిరంగా ఉండడం ఇది ఐదవ రోజు. ఇది ఇలా ఉండగా వెండి రేటు కూడా ఇదే దారిలో నడుస్తోంది. ఇక బంగారం ధరలకు సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
వెండి రేటు కూడా నిలకడగా వుంది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.76,000 వద్దనే ఉంది. ఇక బంగారం ఎలా వుంది అనేది చూస్తే.. హైదరాబాద్ మార్కెట్ లో బుధవారం బంగారం ధర నిలకడగానే ఉంది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీనితో ధర రూ.49,750 వద్దనే ఉంది. ఇది ఇలా ఉంటే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అలానే వుంది. రూ.45,600 వద్ద నిలకడగా ఉంది.
అలానే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. 0.03 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1889 డాలర్లకు ఎగసింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలైన వాటి వలన బంగారం పై ప్రభావం పడుతుంది అన్న సంగతి తెలిసినదే.