నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హత తో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో జాబ్ పొందొచ్చు. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్-AFCAT 2 2021 నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చెయ్యనున్నారు. ఇది ఇలా ఉంటే జనవరి లో AFCAT దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 235 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అయితే AFCAT 2 నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈసారి 334 పోస్టులని భర్తీ చెయ్యనున్నారు. 2021 జూన్ 1 నుంచి జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం వుంది.
అర్హత, ఆసక్తి వున్నా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనిలో కనుక ఎంపికైతే హైదరాబాద్ లోని దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ లో శిక్షణ ఇస్తుంది ఐఏఎఫ్. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ బ్యాచెస్ (టెక్నికల్, నాన్ టెక్నికల్) లో కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలౌతుంది. https://www.careerindianairforce.cdac.in/ లేదా https://afcat.cdac.in/ వెబ్‌సైట్లలోపూర్తి వివర్రాలని చూడచ్చు.