హైదరాబాద్ చేరుకున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్

-

హైదరాబాద్: రష్యాలో తయారైన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC)లో ఉదయం 03.43 గంటలకు ఈ వ్యాక్సిన్లు రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ఫ్రైటర్ RU-9450 ద్వారా హైదరాబాద్ చేరుకున్నాయి. దీనికి ముందు GHAC ఇప్పటికే అనేక వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంది. ఇప్పటివరకు భారతదేశానికి వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్లలో, ఈ 56.6 టన్నులే అతిపెద్ద దిగుమతి.

స్పుత్నిక్ V వ్యాక్సిన్‌కు ప్రత్యేకమైన నిర్వహణ అవసరం. దీనిని -20°C ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. వ్యాక్సిన్లను సజావుగా దిగమతి చేసుకోవడానికి ఎయిర్ కార్గో టెర్మినల్ వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు, నిర్వహణ ప్రక్రియలు పూర్తిగా ఉన్నాయని నిర్ధారించడానికి GHAC చాలా రోజులుగా సప్లై చెయిన్ టీమ్, కస్టమ్స్ విభాగం అధికారులు, ఇతర భాగస్వాములతో కలిసి పని చేస్తున్నాయి. ఈ పెద్ద వ్యాక్సిన్ల దిగుమతితో, భారతదేశంతో అతిపెద్ద వ్యాక్సిన్ దిగుమతి కేంద్రంగా GHAC తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది.

రాబోయే రోజుల్లో హైదరాబాద్, చుట్టుపక్కల ఉన్న ప్రధాన ఫార్మా కంపెనీలు 3.5 బిలియన్ల డోసుల వివిధ రకాల COVIDవ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడం లేదా దిగుమతి చేసుకుంటాయని భావిస్తున్నారు. అందువల్ల వ్యాక్సిన్లను సజావుగా నిర్వహించేందుకు GHAC అన్ని వనరులనూ సమకూర్చుకుంటోంది. GHACలో టెంపరేచర్ కంట్రోల్డ్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నారు. GHAC భారతదేశపు మొట్టమొదటి డెడికేటెడ్ ఫార్మా కార్గో ఎగుమతి టెర్మినల్ అయిన ‘ఫార్మా జోన్’ సామర్థ్యాన్ని విస్తరించింది. టెర్మినల్ నుంచి విమానానికి సరుకులను సురక్షితంగా రవాణా చేయడానికి టెంపరేచర్ కంట్రోల్డ్ ‘కూల్ డాలీ’ను ప్రవేశపెట్టింది. దీని వల్ల ట్రక్కు ఆఫ్‌లోడింగ్ పాయింట్ నుంచి విమానం లోడింగ్ వరకు వ్యాక్సిన్లు, ఔషధాల ఎలాంటి ఆటంకాలూ లేని కోల్డ్ చెయిన్ సదుపాయాలను అందిస్తోంది.

మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు GHAC వ్యాక్సిన్లు, ఇతర కోవిడ్ రిలీఫ్ మెటీరియల్స్, ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు మొదలైన వాటికి ప్రాధాన్యతనివ్వడానికి, వాటికి వేగంగా అనుమతులు ఇవ్వడం కోసం కస్టమ్స్ అధికారులు, విమానయాన సంస్థలు, ఫ్రైట్ ఫార్వార్డర్లు, ఇతర భాగస్వాములతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.

GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC) భారతదేశంలో WHO-GSDP (ప్రపంచ ఆరోగ్య సంస్థ- మెరుగైన నిల్వ మరియు పంపిణీ పద్ధతులు) ద్వారా సర్టిఫై చేయబడిన విమానాశ్రయం. టెంపరేచర్ సెన్సిటివ్ కార్గో నిర్వహణకు, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ఆటంకాలూ లేకుండా వాటిని సరఫరా చేయడానికి ఇది సదుపాయాలను కలిగి ఉంది. పెరిషబుల్స్, వ్యవసాయోత్పత్తులు, టెంపరేచర్ కంట్రోల్డ్ ఔషధాల కోసం GHAC ల్యాండ్‌సైడ్, ఎయిర్‌సైడ్‌లో తన మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది. దీనిలో భాగంగా ఎయిర్ సైడ్ రవాణా కోసం మొబైల్ రిఫ్రిజిరేటెడ్ యూనిట్ కూల్ డాలీని ప్రారంభించింది. ఇక్కడి నుంచి ప్రధానంగా పెరిషబుల్స్, (వ్యవసాయ మరియు సముద్ర ఉత్పత్తులు), ఔషధాలు, ఇంజనీరింగ్ & ఏరోస్పేస్, వస్త్రాలు మరియు ఎలక్ట్రానిక్స్ ఎగుమతి అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news