న్యూఢిల్లీ: అతని టాలెంట్‌కు ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. నీళ్లలో ఉన్న చెట్టుపైకి ఎక్కుతున్న కోతి ఫొటోను తీశాడు. ఈ ఫొటో ఇప్పుడు అందరినీ అబ్బురపరిచింది. అంతేకాదు లక్షలు వచ్చేలా చేసింది. అసలు విషయమేంటంటే… కేరళకు చెందిన థామస్ విజయన్ కెనడాలో సెటిల్ అయ్యారు. ఆయన ఓ ఫొటో గ్రాఫర్. తాజాగా విజయన్ 2021 సంవత్సరపు నేచర్ టిటిఎల్ ఫొటోగ్రాఫర్ అవార్డును గెలుచుకున్నారు. బోర్నియోలో ‘ది వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్‌సైడ్ డౌన్’ అనే చిత్రాన్ని చిత్రీకరించారు. తాను నీటిలో ఉన్న ఒక చెట్టును ఎంచుకున్నాడు. ఆ తర్వాత చెట్టెక్కి గంటలకొద్దీ వెయిట్ చేశాడు. అయితే పై నుంచి తనకు నీళ్లలో ఉన్న చెట్టును అద్దంలో చూస్తున్నట్టనిపించింది. ఆ సమయంలో ఓ కోతి చెట్టు పైకెక్కింది. వెంటనే ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించారు. ఈ ఫొటోనే తనకు లక్షలు వచ్చే చేసిందని విజయన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మొత్తం రూ.1.5 లక్షల బహుమతి తనకు దక్కిందని పేర్కొన్నారు. మొత్తం 8 వేల ఫొటోల్లో తన ఫొటోకు బహుమతి రావడం ఆనందంగా ఉందని చెప్పారు. విజయన్ భారతసంతతి వ్యక్తి కావడంతో భారతీయుల్లో కూడా హర్షం వ్యక్తమవుతోంది. విజయన్ తీసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కోతి ఫొటో తీసి లక్షలు గెలుచుకున్నాడు
-