కోవిడ్ వారియర్స్ పై రాజమౌళి సినిమా..

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ఎగరవేసిన దర్శక ధీరుడు రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా అభిమానులందరూ ఆర్ ఆర్ ఆర్ సినిమాపై చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కరోనా కారణంగా ఆగిపోయింది. అదలా ఉంటే, తాజాగా రాజమౌళి నుండి మరో సినిమా రానుందని వినబడింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో దానికి ఎదురెళ్ళి సేవలందిస్తున్న పోలీసులు, కోవిడ్ వారియర్స్ మీద చిన్న లఘుచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట.

ఈ మేరకు సమాచారం బయటకి వచ్చింది. కరోనా సమయంలో పెట్టిన లాక్డౌన్ లో పోలీసులు పడుతున్న కష్టాలు మీడియాలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి మీద చిన్న లఘుచిత్రాన్ని రూపొందించనున్నారు రాజమౌళి. మరి ఈ లఘుచిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకా వెల్లడి కాలేదు.