బట్టలు మార్చుకునేంత ఈజిగా మాట మారుస్తారా : కెసిఆర్ పై షర్మిల ఫైర్

-

వైయస్ షర్మిల ఇవాళ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. వికారాబాద్, పరిగి ప్రాంతాల్లోని రైతులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా తెలంగాణ సిఎం కెసిఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్, ధాన్యం కొనుగోళ్లు రెండింటిలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ధాన్యం పండించిన రైతులు ఇబ్బందులు పడుతుంటే.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. మొండి నమ్మకంతో గుండె నిబ్బరంతో సాగు చేస్తున్న రైతులు గుండెలు బాదుకునేలా అరుస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. చివరి గింజ వరకు కొంటానని చెప్పారని.. ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. బట్టలు మార్చుకునేంత ఈజిగా మాట మారుస్తారా ? అని కెసిఆర్ ను నిలదీశారు వైఎస్ షర్మిల. 80 వేల పుస్తకాలు చదివి…ఎకరాకు కోటి రూపాయల లాభంతో సాగు చేసే కేసీఆర్ కు రైతు కష్టం తెలియదా ?అని ప్రశ్నించారు.

సిఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అని… ఖమ్మంలో రైతులకు బెడిలు వేశారన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పారని… నెల రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ప్రతి రైతుకు తరుగు, హమాలి పేరుతో ఎకరాకు 30 వేల నష్టం జరుగుతుంది… ప్రభుత్వం ఇచ్చే 5 వేల రూపాయలు ఎందుకు? అని నిలదీశారు. మొలకలు వచ్చినా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని…రైతు పొట్ట మీద కొట్టడం భావ్యం కాదన్నారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోమని హెచ్చరించారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news