కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపిలో రేపు బిగ్ వ్యాక్సిన్ డేను నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రేపు ఒక్క రోజే 8 లక్షల వ్యాక్సిన్లు వేసేందుకు ప్రణాళికలు వేస్తోంది సర్కార్. వ్యాక్సిన్ విషయంలో జిల్లాలకు టార్గెట్ ఫిక్స్ చేసింది వైద్యారోగ్య శాఖ. ఇక ఇప్పటి వరకు ఒక్క రోజే 6 లక్షల వ్యాక్సిన్ వేసి చరిత్ర సృష్టించిన ఏపి ప్రభుత్వం… ఇప్పటి వరకు ఏపిలో కోటి 22 లక్షల 83 వేల 479 డోసులు వేసింది.
ఇప్పటివరకు 26 లక్షల 41 వేల 739 మందికి రెండు డోసులు వేయగా… 70 లక్షల మందికి ఒక్క డోస్ ఇచ్చింది. కాగా ఏపీలో గడచిన 24 గంటల్లో 1,07,744 కరోనా పరీక్షలు నిర్వహించగా 6341 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే 53 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటల్లో 8486 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారు. దీంతో ఏపీలో నమోదైన కేసుల సంఖ్య 18,39, 243 చేరుకోగా 12,224 మంది మృతి చెందారు.