యోగ చేసేవారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది..!

-

యోగ చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. నిజంగా యోగాని దివ్య ఔషధం అనే చెప్పాలి. యోగాసనాల వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా అవుతుంది. అయితే యోగా చేసేటప్పుడు తప్పని సరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

యోగ

ఆహారం తీసుకున్న వెంటనే యోగ చెయ్యద్దు. రెండు గంటల తర్వాత మాత్రమే యోగ చేయాలి. వెంటనే కనుక యోగ చేశారంటే జీర్ణ సమస్యలు వస్తాయి అని గుర్తుంచుకోండి. ఒకవేళ ఆకలి ఎక్కువగా ఉంటే లైట్ గా పండ్లు లాంటివి తీసుకోండి. అంతేకాని ఎక్కువ తినొద్దు.

అదే విధంగా యోగా చేసే ముందు కచ్చితంగా శ్వాస ప్రక్రియలు, ప్రాణాయామం చేసి ఆ తర్వాత మాత్రమే యోగాన్ని ప్రారంభించడం మంచిది. వ్యాయామం చేసేటప్పుడు వామప్ ఎలా చేస్తామో అదే విధంగా యోగకి ప్రాణయామం చేయాలి.

ప్రశాంతమైన ప్రదేశంలో మాత్రమే యోగ సాధన చేయండి. నెమ్మదిగా, మనస్ఫూర్తిగా యోగా చేస్తే మంచిది.

యోగా చేయడం సులభం కాదు. కాబట్టి ఓపిగ్గా నెమ్మదిగా నేర్చుకుంటే ఆ తరువాత అలవాటు అయిపోతుంది.

అదే విధంగా యోగాసనాలు వేయడానికి అస్సలు బద్దకించద్దు. సమయం చూసుకుని రెగ్యులర్ గా యోగా చేయడం వల్ల చక్కటి ఫలితాలు కనపడతాయి. రేపు చేద్దాంలే అని ఆలస్యం చేస్తే అది అలా పోస్ట్ పోన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆసక్తితో సమయపాలనతో యోగా చేయండి.

యోగా చేసే సమయంలో మీ మొబైల్ ని దూరంగా ఉంచండి. పక్కన మొబైల్ పెట్టుకుని యోగా చేయడం వల్ల ఏకాగ్రత పోతుంది.

యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా వుంటారు. కాబట్టి రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి మంచిది.

యవ్వనంగా కూడా కనిపిస్తారు. కంటి సమస్యల నుండి ఎన్నో సమస్యలు యోగాతో తరిమేయచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news