ఆనందయ్య కంటి చుక్కల మందు పంపిణీపై విచారణ వాయిదా

-

అమరావతి: ఆనందయ్య మందు పంపిణీ పై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆనందయ్య పంపిణీ చేస్తున్న చుక్కల మందును ఐదు ల్యాబ్‌ల్లో టెస్టులు జరిపించామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు తెలిపారు. చుక్కల మందులో కంటికి హాని కలిగించే ఒక పదార్ధముందని ల్యాబ్‌లు నివేదిక ఇచ్చినట్లు ధర్మాసనానికి తెలిపారు. ల్యాబ్‌ల నివేదికను తమ ముందు ఉంచాలని లాయర్‌కు న్యాయస్థానం ఆదేశించింది. కంటి చుక్కల మందును ఆయుష్ రీసెర్చ్ సెంటర్‌లో టెస్ట్ చేయించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. తదుపరి విచారణను ధర్మాసనం జులై 1 కి వాయిదా వేసింది.

కాగా రాష్ట్రంలో ఆనందయ్య మందు పంపిణీ కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో ఈ మందును ప్రజలకు పంచుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు కంటి చుక్కల మందును మాత్రం పంపిణీ చేయటంలేదు. చుక్కల మందు పంపిణీపై జూన్ 4న హైకోర్టు విచారణ జరిగింది. ఈ మందు పంపిణీ విషయంలో తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు అప్పుడు స్పష్టం చేసింది. విచారణను వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news