భారతీయ జనతా పార్టీకి పోటీగా ఫెడరల్ ఫ్రంట్ నిర్మాణం జరుగుతుందన్న వార్తలు నిజం కానున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే పార్టీలు కనబడట్లేనందున ప్రాంతీయ పార్టీలు ఆ పనికి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ నివాసంలో అన్ని ప్రతిపక్షాల సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ శరద్ పవార్ అధ్యక్షుడిగా ఉంటున్నారు. గడిచిన రెండు వారాల కాలంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని కలుసుకున్న శరద్ పవార్, ఇప్పుడు ఈ మీటింగ్ కి అధ్యక్షత వహించడం చర్చనీయాంశంగా మారింది.
బీజేపీని ఎదుర్కొనేందుకు ఫెడర్ల్ ఫ్రంట్ ఏర్పడుతుందనే విషయంలో నమ్మకం బాగా ఏర్పడింది. ఈ రోజు జరుగుతున్న సమావేశానికి ఆర్జేడీ లీడర్ మనోజ్ కుమార్ జా, సీపీఎమ్ నాయకుడు సీతారాం ఏచూరి, సీపీఐ నాయకులు డి రాజా హాజరు కానున్నారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీపై నెగ్గిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.