రజిని ‘పేట’ ఫస్ట్ టాక్

-

సూపర్ స్టార్ రజినికాంత్, కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వచ్చిన సినిమా పేట. ఈరోజు తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హడావిడి ఎలా ఉన్నా చెన్నైలో మాత్రం హంగామా మొదలైంది. అక్కడ ఫస్ట్ షో ఆల్రెడీ పడగా మొదటి షో నుండి మిక్సెడ్ రెస్పాన్స్ అందుకుంది పేట. తమిళంలోనే అలాంటి టాక్ వచ్చింది అంటే ఇక తెలుగులో ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

డాన్ గా రజిని మరోసారి భాషా స్టైల్ లో ఈ సినిమా తీశారు. కారిక్ సుబ్బరాజు కథ, కథనాలు పరమ రొటీన్ గా ఉన్నాయని తెలుస్తుంది. రజిని స్టైల్ కోసం ఆయన ఫ్యాన్స్ మాత్రమే ఈ సినిమా చూసే అవకాశం ఉంది. అంతేతప్ప సిని లవర్స్ కూడా ఈ సినిమా ఇష్టపడే అవకాశం లేదని అంటున్నారు. రజిని అభిమాని అయిన కార్తిక్ సుబ్బరాజు రజినిని గొప్పగా చూపించాలని అనుకున్నాడే తప్ప అందుకు తగిన కథని మాత్రం రాసుకోలేదని అంటున్నారు.

ఫైనల్ గా రజిని అపజయాల పరంపరను పేట కూడా కొనసాగిస్తుందని తెలుస్తుంది. 600 కోట్ల బడ్జెట్ తో శంకర్ లాంటి డైరక్టర్ తీసిన 2.ఓని రజిని క్రేజ్ కాపాడలేదు. ఇక పేట తెలుగులో మాత్రం దారుణమైన ఫలితాన్ని అందుకుంటుందని తెలుస్తుంది. తమిళంలో రజిని మేనియా ద్వారా అలా నడిచిపోతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news