వాస్తు: ఇంటికి బేస్మెంట్ ఎప్పుడూ కట్టద్దు..!

-

వాస్తు పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు. వీటిని కనుక మీరు అనుసరిస్తే మంచి జరుగుతుంది. చాలా మంది వాస్తుని అనుసరించకుండా ఇల్లు కడుతున్నారు. దీని వల్ల వాళ్లకి భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.

వాస్తు

అయితే చాలా మంది ఇప్పుడు ఇళ్ళని నిర్మించుకునేటప్పుడు బేస్మెంట్ ని కడుతున్నారు. స్పేస్ తక్కువగా ఉండడం వల్లనో లేదు అంటే ఇతర కారణాల వల్లనో బేస్మెంట్ ని కట్టి ఆ తర్వాత ఇల్లు ని కడుతున్నారు. అయితే వాస్తు ప్రకారం బేస్మెంట్ ని కట్టడం మంచిది కాదని పండితులు చెప్తున్నారు.

అలా బేస్మెంట్ కట్టి వదిలేయడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని ఇది మొత్తం మూసుకుపోయి ఉండడం వల్ల సూర్యకిరణాలు, గాలి సరిగ్గా రావని పాజిటివిటీ ఉండదని అంటున్నారు. ఒకవేళ కనుక మీరు బేస్మెంట్ తప్పకుండా కట్టుకోవాలి అనుకుంటే అప్పుడు ఈ ఈ విషయాలపై శ్రద్ధ తీసుకోవడం మంచిదని పండితులు అంటున్నారు.

మొత్తం ఇల్లు అంతా బేస్మెంట్ కట్టే బదులు కొంత భాగంలో మాత్రమే బేస్మెంట్ కడితే పరవాలేదు అని చెప్పారు. అదే విధంగా బేస్మెంట్ ని కట్టేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేటట్టు చూసుకోవాలని తూర్పు లేదా ఉత్తరం దిక్కు లో ఓపెన్ చేసి ఉండడం వల్ల ఇబ్బందులు రావని పండితులు అంటున్నారు. కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేదంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news