పుల్వామాలో ఉగ్రవాదుల కాల్పులు.. స్పెషల్ ఆఫీసరు మృతి.

-

జమ్మూ కాశ్మీర్ పుల్వామా దాడి గురించి దేశ ప్రజలెవ్వరూ మర్చిపోరు. భారతదేశ గడ్డపై ఉగ్రవాదులు జరిపిన ఈ మారణహోమంపై యావత్ భారతదేశం ఊగిపోయింది. ఆ తర్వాతే బాలాకోట్ దాడులు జరిగాయి. అదలా ఉంటే, తాజాగా పుల్వామాలో మరోమారు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మాజీ స్పెషల్ పోలీస్ ఆఫీసరుపై కాల్పులు జరిపారు. పుల్వమాలోని హరిప్రామ్ అనే ఏరియాలో ఈ సంఘటన జరిగింది. గుర్తు తెలియని ఉగ్రవాదులు స్పెషల్ ఆఫీసరు ఇంట్లోఖి జొరబడి, కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో స్పెషన్ ఆఫీసర్ ఫయాజ్ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు. అంతే కాదు ఆయన భార్య కూడా బుల్లెట్ల తాకిడికి గురైంది. ఇంకా వారి కూతురికి తీవ్రంగా గాయాలయ్యాయి. విపరీతమైన గాయలతో ఉన్న వీరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఐతే ఈ కాల్పుల్లో దంపతులు ఇద్దరూ మరణించారు. కూతురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గడిచిన రెండు నెలల్లో ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగడం ఇది మూడవసారి.

Read more RELATED
Recommended to you

Latest news