ప్రతి సంవత్సరం ప్రపంచమంతా జూన్ 28వ తేదీన ‘ఇంటర్నేషనల్ లైట్నింగ్ సేఫ్టీ డే’ ని జరుపుతారు. వారం రోజుల పాటు మెరుపులు నుండి ప్రజలను సురక్షితంగా ఎలా ఉండాలి అనే దానిపై అవగాహన కల్పిస్తారు. గతంలో కూడా చాలా మంది పిడుగులు, మెరుపులు కారణంగా మరణించడం జరిగింది. 2018 లో అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలా మంది మరణించడం జరిగింది.
భారతదేశంలో కేవలం 2018 లో 1,755 మంది చనిపోయారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు చనిపోకుండా ఉండాలంటే తప్పకుండా ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. మెరుపులు వచ్చే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి.
బయట ఉండకండి:
భారీ వర్షం మెరుపులు కనక వస్తూ ఉంటే బయటికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండడం మంచిది. దీని వల్ల ఎటువంటి అపాయం కలగకుండా జాగ్రత్తగా ఉండొచ్చు.
చెట్టు కింద ఎప్పుడూ ఉండద్దు:
మీరు బయటకు వెళ్లి అక్కడ ఉండిపోవాల్సి వస్తే పెద్ద పెద్ద చెట్లు కింద అస్సలు ఉండద్దు. దీని వల్ల ప్రమాదం మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. చాలామంది చేసే పొరపాటు ఇదే. ఇలాంటి పొరపాటు చేయకుండా పెద్ద పెద్ద చెట్ల నుండి దూరంగా వచ్చేయండి.
ప్రభుత్వ ఆదేశాలను వినండి:
ప్రభుత్వం లేదా వాతావరణ శాఖ చెప్పే సలహాలుని వినండి. ఎప్పుడైనా ఏమైనా వాతావరణ మార్పులు ఉన్నాయని చెబితే మీ ప్రయాణాలని వాయిదా వేసుకోండి. ఇలా మీరు ముందుగానే జాగ్రత్త పడొచ్చు.
స్నానం చేయడం సామాన్లని శుభ్రం చేసుకోవడం లాంటివి చేయొద్దు:
మెరుపులు వంటివి వచ్చే సమయంలో నీళ్ల నుండి దూరంగా ఉండటం మంచిది. అటువంటి సమయంలో స్నానం చేయడం, సామాన్లు కడగడం లేదా ఇతర పనులు చేయడం మంచిది కాదు.
ఓపెన్ ప్రదేశాల్లో ఉండద్దు:
మెరుపులు పడే సమయంలో బాల్కని వంటి ఓపెన్ ప్రదేశాలలో ఉండడం అస్సలు మంచిది కాదు ఇలా ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇతరులకి చెప్పండి.