న్యూఢిల్లీ: బ్యాంక్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ ఇది. జులై నెలలో మొత్తం 15 రోజులు పాటు బ్యాంకులు పని చేయవు. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. జులై నెలలో నాలుగు ఆదివారాలతో పాటు రెండు, నాలుగో శనివారాలు బ్యాంకు సిబ్బందికి సాధారణంగా సెలవులు ఉంటాయి. వీటితో పాటు మరో 9 రోజులు కూడా బ్యాకులు పని చేయవు. పండగలు ప్రత్యేకమైన రోజులు కారణంగా మరో 9 రోజులు బ్యాంకులు అధికారులు పని చేయరు. అయితే ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ నిర్ణయాలను బట్టి పని దినాల్లో మార్పులు ఉండొచ్చు.
ఇక బ్యాంకు వినియోగదారులకు ఈ తేదీల్లో మినహా మిగిలిన రోజుల్లో సేవలు వినియోగించుకోగలరని భారతీయ రిజర్వ్ బ్యాంక్ కోరింది. బ్యాంకు సెలువులు తెలుసుకుని తమ రాష్ట్రాల్లో లావాదేవీలు జరుపుకోవాలని సూచించింది. బ్యాంకు సేవలకు కోవిడ్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.
సెలవు రోజులు ఇవే.. ఖాతాదారులు గమనించగలరు.
జులై 4 – ఆదివారం
జులై 10 – రెండో శనివారం
జులై 11 – ఆదివారం
జులై 18 – ఆదివారం
జులై 24 – నాలుగో శనివారం
జులై 25 – ఆదివారం
జులై 12 – కాంగ్ (రథజత్ర) / రథయాత్ర
జులై 13 – భాను జయంతి
జులై 14 – దృక్ప శేచి
జులై 16 – హరేల
జులై 17 – యు టిరోట్ సింగ్ డే/ కర్చీ పూజ
జులై 19 – గురు రింపోచి తుంగ్ కార్ శేచి
జులై 20 – బక్రీద్
జులై 21 – బక్రి ఈద్ (ఈద్ ఉల్ జుహా) (ఈద్ ఉల్ అదా)
జులై 31 – కేర్ పూజ