అమరావతి : వైయస్సార్ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శతమానం భవిత అంటూ ఉంటారని.. వందేళ్లు వర్థిల్లాలని కోరుకుంటారన్నారు. 100 సంవత్సరాలు బతకాలని, ఏ ఒక్కరికీ ఎలాంటి ఆపద రాకూడదని మనసారా కోరుకునే ప్రభుత్వం మనదని చెప్పారు. 5 లక్షల వరకూ వార్షికాదాయం ఉన్న వారిని కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకు వచ్చామని.. అలాగే ఆరోగ్యశ్రీ కింద అందే చికిత్సల సంఖ్యను పెంచామని పేర్కొన్నారు. దాదాపు 1.30 లక్షల కుటుంబాలు వైయస్సార్ బీమా పరిధిలోకి వచ్చాయని.. కుటుంబంలో సంపాదించే వ్యక్తిని ఇన్సూరెన్స్ కవర్‌లోకి తీసుకు వస్తున్నామన్నారు.
పేద కుటుంబాలమీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని.. 18 నుంచి 50 ఏళ్లలోపు సహజమరణం వస్తే రూ.1లక్ష రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. 18 నుంచి 70 ఏళ్లలోపై ప్రమాదశాత్తూ మరణిస్తే.. రూ. 5 లక్షలు పరిహారమని.. 2020–2021 సంవత్సరానికి బాధిత కుటుంబాలకు మేలు చేసే ఉద్దేశంతో 1.32 కోట్ల కుటుంబాలకు రూ. 750 కోట్లతో బీమా రక్షణ కల్పిస్తున్నమని వెల్లడించారు. ఈ రెండేళ్లకాలంలో వైయస్సార్ బీమా కింద చేసిన ఖర్చు అక్షరాల రూ.1307 కోట్లు అని చెప్పారు సిఎం జగన్.
ఈ సమయంలో అర్హులైన వారు కూడా బ్యాంకుల్లో ఎన్‌రోల్ కాకుండా కొంతమంది మిగిలిపోయారని..ఏ నెలలో జరిగితే.. అదే నెలలో క్లెయిములన్నింటినీ పరిష్కారించాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలకు పూర్తి బాధ్యతలు అప్పగించామని.. సమస్యలను పరిష్కరించడానికి టోల్‌ఫ్రీ నంబర్ 155214 తీసుకువచ్చామని పేర్కొన్నారు.